Tuesday, August 18, 2026
HomeTelanganaదశాబ్ది ఉత్సవాల సంక్షిప్త సమాచారం పుస్తకావిష్కరణ

దశాబ్ది ఉత్సవాల సంక్షిప్త సమాచారం పుస్తకావిష్కరణ

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు తలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మంచిర్యాల జిల్లా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సంక్షిప్త సమాచారం పుస్తకాన్ని జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్ నాయక్, బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో జరిగిన ప్రతి అంశాన్ని వివరిస్తూ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి వై. సంపత్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.