
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో సోమవారం గడప గడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పేదల సంక్షేమం కోసం పాటు పడే బీజేపీని గెలిపించాలని కోరారు..
