Tuesday, August 18, 2026
HomeTelanganaపౌర హక్కులపై అవగాహనా ఉండాలి': ఎస్ఐ తైసీనుద్దీన్

పౌర హక్కులపై అవగాహనా ఉండాలి’: ఎస్ఐ తైసీనుద్దీన్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల పట్టణ ఎస్ఐ తైసీనుద్దీన్  అన్నారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అండలమ్మా కాలనీ లో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులందరికి సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగా హన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంద న్నారు. కుల వివక్ష లేకుండా అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలన్నారు. అంటరానితనం వంటి అమానుషమైన చర్యల కు పాల్పడే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారులు, ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.