Tuesday, August 18, 2026
HomeTelanganaఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన

ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన

📰 Generate e-Paper Clip

ఉచిత మంచినీటి ట్యాంకర్ల ను ప్రారంభిస్తున్న  ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కీ.శే. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల పట్టణంలో ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ప్రజలకు నీటి సరఫరా అందించేందుకు నీటి ట్యాంకర్లను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారు ప్రారంభించారు. ఆదివారం తన నివాసం ముందు మంచిర్యాల ప్రజలకు సరఫరా చేయనున్న ఆరు(6) ట్యానకర్ల ను ప్రారంభించి ప్రజలకు సేవ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కరోనా తీవ్రంగా ఉన్న సమయం మినహా ప్రతి ఏటా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడవద్దనే భావంతో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు ఇంకా నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీరు ఎందుకు అందించే దుస్థితి కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలని సూచించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.