Tuesday, August 18, 2026
HomeTelanganaలాటరీ పద్ధతిలో హోంగార్డుల బదిలీ

లాటరీ పద్ధతిలో హోంగార్డుల బదిలీ

📰 Generate e-Paper Clip

స్థానిక పోలీసు హెడా క్వార్టర్స్ లో హోంగార్డుల బదిలీ ప్రక్రియ లాటరీ పద్ధతి ద్వారా ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పూర్తి చేశారు.

నిర్మల్ కు 62, కుమురం భీంకు 38 మంది

హోంగార్డుల బదిలీ సందర్భంగా సూచనలు చేస్తున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: స్థానిక పోలీసు హెడా క్వార్టర్స్ హోంగార్డుల బదిలీ ప్రక్రియ లాటరీ పద్ధతి ద్వారా ఆదిలాబాద్ ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పూర్తి చేశారు. గతేడాది నిర్మల్, కుమురం భీం జిల్లాలకు బదిలీపై వెళ్లిన హోంగార్డులు ఈ ఏడాది తిరిగి జిల్లాకు రానున్నారు. వారి స్థానంలో ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న 115 మంది హోంగార్డులకు లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. ఇందులో 62 మందిని నిర్మల్, 38 మందిని కుమురం భీం జిల్లాకు బదిలీ చేయగా, మరో 15 మందిని ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించారు. హోంగార్డుల సమక్షంలోనే లాటరీ ద్వారా పూర్తి చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాసరావు, బి. రాములునాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి. వెంకటి, ఎం. వంశీకృష్ణ, జి. వేణు, కిరణ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.