Saturday, August 22, 2026
HomeTelanganaఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో  మంగళవారం రాత్రి స్థానిక వైశ్య భవన్ లో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం వేడుకలలో భాగంగా మంచిర్యాలలోని వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న 13 మంది మహిళలను ఎంపిక చేసి వాసవీ అనిత క్లబ్ ఆధ్వర్యంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల అటవీశాఖ డిఎస్ఓ సాగరిక, న్యాయవాది గట్టు కవిత, వాసవీక్లబ్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరి నలుమాసు లావణ్య, వనితాక్లబ్ చార్టర్ అధ్యక్షురాలు సిద్దంశెట్టి మధుశ్రీ, మాజీ వనిత క్లబ్ అధ్యక్షురాలు నాగిశెట్టి జ్యోతి , మాజీ వనితా క్లబ్ అధ్యక్షురాలు చిలువేరు జ్యోతి, మాజీ వనిత క్లబ్ అధ్యక్షురాలు నరేందుల భవాని, జోన్ చైర్మన్ గౌరిశెట్టి ధనలక్ష్మిల, మంచిర్యాల మున్సిపల్ రిసోర్స్ పర్సన్ రేణిగుంట్ల స్వప్న లను వాసవీ వనిత క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులతో పాటు అతిథులు సత్కరించారు. అలాగే ఈ సందర్భంగా దాదాపు 300 మంది మహిళలకు వివిధ రకాల ఆటల పోటీల నిర్వహించి గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం ఉద్దేశం విజయం వినయం లక్కీ మహిళలను ఎంపిక చేసి ప్లకార్డుల రూపంలో ప్రదర్శించి అందర్నీ ఆకర్షించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కొండ చంద్రశేఖర్, గౌరవ అతిథులు అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు ముక్తా శ్రీనివాస్ , కటకం హరీష్ లు మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా ప్రస్తుత తరుణంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ రాణిస్తున్నారని అభినందించారు. ప్రతి మహిళ వారు చేస్తున్నరంగంలో అభ్యున్నతి సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు మోటూరి సరిత, కార్యదర్శి రేణిగుంట్ల స్వప్న , కోశాధికారి బోనగిరి లావణ్య, జోన్ చైర్మన్ గౌరిశెట్టి ధనలక్ష్మి, రీజియన్ చైర్మన్ అక్కినపల్లి రవీందర్, క్యాబినెట్ సెక్రటరీ అప్పాల శ్రీధర్ , వాసవీక్లబ్ అంతర్జాతీయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు పుల్లూరి బాలమోహన్, జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ నాగిశెట్టి జ్యోతి, నలుమాసు లావణ్య, రీజియన్ సెక్రటరీ సిద్ధంశెట్టి మధు శ్రీ, జోన్ చైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.