Tuesday, August 18, 2026
HomeTelanganaఘనంగా  శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా  శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాల వార్షికోత్సవం

📰 Generate e-Paper Clip

శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాల 10వ వార్షికోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని అమ్మ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు..

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాల 10వ వార్షికోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని అమ్మ ఆధ్వర్యంలో  శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం 10వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరయ్యారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలన్నారు. అలా చదివినప్పుడే వత్తి రీత్యా ఉన్నత శిఖరాలను అధిరోహించ గలమన్నారు. చిన్న స్కూల్‌ గా ఏర్పాటు చేసిన శ్రీ సాయి మాతృ మందిర్ ఇంగ్లీష్‌ మీడియం స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో నిలదొక్కుకోవడం అభినందనీయమన్నారు. “స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు రజిని అమ్మ” తనకు అత్యంత సన్నిహితులని తెలిపారు. అనేక కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నప్పటికీ వాటికి దీటుగా పట్టణంలో విద్యపై మమకారంతో విద్యా సేవలందిస్తున్న “రజిని అమ్మ” వారి లక్ష్యానికి అనుగుణంగా మంచిర్యాల పట్టణం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం యాజమాన్యం గొప్పతనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వార్డు కౌన్సిలర్ మరియు పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.