Tuesday, August 18, 2026
HomeTelanganaబయటపడ్డ టీచర్ల బాగోతం..

బయటపడ్డ టీచర్ల బాగోతం..

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయులను ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగింత..

ఆంజనేయులు న్యూస్, ములుగు జిల్లా: విద్యాబుద్ధులు నేర్పే గురువులు వివాహేతర సంబంధం నడుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా భర్తకు పట్టుబడిన సంఘటన. ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మంగపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లో ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, మరో ఉపాధ్యాయురాలు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. టీచర్ భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే వారి వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ ఈ తతంగంపై గతంలోనే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో సదురు టీచర్ ను జనవరిలో మంగపేట నుంచి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపారు. అయినా తీరు మార్చుకోలేదు. ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలో టీచర్ భర్త ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు వేములవాడకు బందోబస్తు కోసం వెళ్లి వచ్చాడు. ఆయనకు సోమవారం హాలీ డే రావడంతో భార్య, కూతురిని చూసేందుకు మంగపేటకు వచ్చాడు. ఈ క్రమంలో నాగేందర్ టీచర్ సెల్ కు ఫోన్ చేయగా, కానిస్టేబుల్ లిఫ్ట్ చేశాడు. అయితే హాలో అనకముందే తాను వస్తున్నానని, తలుపు తీసి ఉంచాలని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పకుండా చివరి గదిని లాక్ చేసి ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఉపాధ్యాయుడు రాత్రి ఇంటికి వచ్చి ఉపాధ్యాయుడు లోపలికి వెళ్లగానే బయటి నుంచి తాళం వేశాడు. అనంతరం కొత్తగూడ మండలంలోని బంధువులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం నాగేందర్, టీచర్ కు దేహశుద్ధి చేసి మండల కేంద్రంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.