మంచిర్యాల కమిషనర్ ను సస్పెండ్ చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భార్య జ్యోతి మరణానికి కారకుడైన మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతి సంతాప సభలో వారు మాట్లాడుతూ ఏడాది కాలంగా అదనపు కట్నం కోసం వేధింపులు చిత్రహింసలు తట్టుకోలేక జ్యోతి బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు. కమిషనర్ బాలకృష్ణ కుటుంబానికి చెందిన ఆస్తి మొత్తాన్ని జ్యోతి పిల్లల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు గూడ రాజిరెడ్డి, మామిడాల సత్య నారాయణ, తుమ్మల శ్రీనివాసరెడ్డి, డీఎస్సీ బోసు, ఇట్టెం రాజయ్య, అడిచెర్ల రాజేశం, కమాండి పోశయ్య, తదితరులు పాల్గొన్నారు.
