Tuesday, August 18, 2026
HomeTelanganaవిధి నిర్వహణలో బాధ్యత, నిబద్ధత అవసరం

విధి నిర్వహణలో బాధ్యత, నిబద్ధత అవసరం

📰 Generate e-Paper Clip

రామగుండం సిపి రెమా రాజేశ్వరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పోలీసులు విచక్షణ, విజ్ఞతలతో, మానవీయ కోణంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, వృత్తి నైపుణ్యత, శాస్త్రీయ పరిశోధనతో నిష్ణాతులు కావాలని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి గెస్ట్ హౌస్ లో రామగుండం కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఎసిపి, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారుల పరిధిలోని ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, నేరాలు, ఫ్యాక్టులు, సంస్థలు, సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ పోలీస్ శాఖలో పని చేసే ప్రతి ఒక్కరికి రోలా కాలేటి ఉండాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల దారులకు చట్టపరిధిలో ఏవిధంగా న్యాయం చేయగలమో ఆలోచించి దానికి తగినట్లు విచారణ చేయాలని అన్నారు. విధుల నిర్వహణలో నిబద్ధత, బాధ్యత కలిగి ఉండాలని, యూనిఫాం కలిగి ఉండాలని, క్రమ శిక్షణ, సమయపాలన కలిగి ఉండాలని, తప్పని సరిగా స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఒక రకమైన నేరాలకు గల కారణాలు విశ్లేషించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను బలపర్చాలని సూచించారు. సిసి కెమరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, నిరుద్యోగ యువతీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఎసిపి నరేందర్, మంచిర్యాల ఎసిపి తిరుపతి రెడ్డి, స్పెషల్ ఎసిపి మోహన్, సిసిఎస్ ఎసిపి వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎసిపి బాల రాజు, బెల్లంపల్లి ఎఆర్ ఎసిపి మల్లిఖార్జున్, సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.