Tuesday, August 18, 2026
HomeTelanganaమున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా.. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని ఆరోపణ

మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా.. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని ఆరోపణ

📰 Generate e-Paper Clip

జగిత్యాల పురపాలక చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన కుటుంబానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: తెరాస జగిత్యాల పురపాలక చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కంటతడి పెట్టారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. “మీకు పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బుల కోసం డిమాండ్ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పాం. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్షగట్టారు. అన్ని పనులకు అడ్డిస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దని హుకుం జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి నరకప్రాయంగా ఉంది. నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యా. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ ఛైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానించారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లా. చెప్పకుండా వార్డు సందర్శన చేసినా వారి దృష్టిలో నేరమే. ఒక్క పనికూడా నా చేతులతో ప్రారంభించకుండా చేశారు. జిల్లా కలెక్టర్ ను కలవొద్దని ఆదేశించారు. అనుకూలంగా ఉన్న కొద్దిమంది కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టారు. అందరిముందూ అవమానించేవారు. బీసీ మహిళననే కక్షగట్టారు. సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా? పేరుకే మున్సిపల్ ఛైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే. నాకు మాట్లాడే స్వేచ్ఛకూడా ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలి. కవితను కూడా కలకూడదు, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదు అని హుకుం. ఆశీర్వదిస్తూ కవిత ఇంటికి వస్తే వేధింపులు. ఎమ్మెల్యేతో మా ప్రాణాలకు ముప్పు ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణం. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నా” అని శ్రావణి మీడియా సమావేశంలో వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.