Friday, August 21, 2026
HomePoliticalకర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం: జేడీఎస్ మీటింగ్ లో మంత్రి సత్యవతి రాథోడ్

కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం: జేడీఎస్ మీటింగ్ లో మంత్రి సత్యవతి రాథోడ్

📰 Generate e-Paper Clip

త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ జనతాదళ్- ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ జనతాదళ్-ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంత్రులందరం కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటామన్నారు. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కర్ణాటకలోని కలబురిగిలో జేడీఎస్ గుల్బర్ గా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. డబుల్ ఇంజిన్ పాలన అంటూ గొప్పలు చెప్పే భాజపా కర్ణాటకలో తమ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణలో రూ.2016 పింఛన్ ఇస్తుంటే… కర్ణాటకలో మాత్రం రూ.600 ఇస్తోన్నారన్నారు. అనంతరం సత్యవతి అక్కడి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.