
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భార్య వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఓ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భగత్ నగర్ కు చెందిన శ్రావణ కుమార్- బొద్దు రజిత దంపతులు. శ్రావణ ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా ఇటీవలే అమృత్సర్ కు వెళ్లాడు. ఈ క్రమంలో హాజీపూర్ లొనీ ర్యాలిగడ్ పూర్ కు చెందిన బొప్ప రాకేష్ తో రజితకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఇంటికి వచ్చిన భర్త శ్రావణ్ కుమార్ కు విషయం తెలియడంతో చాలా సార్లు మందలించాడు. అయినా రజితలో మార్పు రాలేదు. తప్పని చెప్పాల్సిన రజిత తల్లి భాగ్య కూడా సపోర్ట్ చేసింది. ఈ క్రమంలో రజిత, తల్లి భాగ్య, ప్రియుడు రాకేష్ కలిసి. శ్రావణను మానసికంగా వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణ్.. ఫ్యాన్ కు ఉరేసుకుని గురువారం మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రజిత, భాగ్య, రాకేష్ పై కేసు నమోదు చేశారు.
