Monday, August 17, 2026
HomeTelanganaఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి

📰 Generate e-Paper Clip

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది.

రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డీ హాజరై గౌరవ వందనం స్వీకరించి, అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్  ప్రదర్శనని పరిశీలించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని అలాగే సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ ఏ.ఆర్ ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జాలోద్దీన్, ఆర్ఐ లు శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.