
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడుతో కలిసి కుష్ఠు వ్యాధి నిర్మూలన సంబంధిత గోడప్రతులు, కరపత్రాలు, ఫ్లాష్కార్డ్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ కుష్టు నిరూల్మన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ నెల 6 నుండి 22వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి కుష్ఠు వ్యాధి అనుమితులను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఆచరించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో 667 బృందాలను ఆశ కార్యకర్తలతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృంద సభ్యులు ప్రతి రోజు ఉ దయం 6 గం||ల నుండి 9 గం||ల వరకు వారికి కేటాయించిన ఇండ్లలో తిరిగి అనుమానిత కేసులను గుర్తించాలని ఆదేశించారు. ఈ కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రెన్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అతి సామాన్యమైనదని, ఇది ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుందని, కుష్ఠు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి 3 సం||ల నుండి 5 సం||ల కాలం పడుతుందని, కుష్ఠు వ్యాధి ఎవరికైనా రావచ్చని, కుష్ఠు వ్యాధి వంశపారంపర్యం కాదని, ప్రజలందరు ఈ విషయాన్ని తెలుసుకొని వ్యాధిగ్రస్తులతో స్నేహపూర్వకంగా మెదలాలని తెలిపారు. ఈ సర్వే బృందాలతో స్థానిక సూపర్వైజర్లు పాల్గొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎవరికైనా కుష్ఠువ్యాధి మచ్చలు, సహజచర్మపు రంగు కంటే తక్కువ / ఎరుపు / రాగి రంగు కలిగి ఉంటాయని, మచ్చలపై స్పర్శ ఉండదని, నొప్పి ఉండదని, దేహంలో ఏ ప్రదేశంలోనైనా రావచ్చని తెలిపారు. కుష్ఠు వ్యాధికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, డా॥ నీరజ, డా॥ అనిత, డా॥ ఫయాజ్, డా॥ విజయనిర్మల, డా॥ రామకృష్ణ, నోడల్ అధికారి శివకుమార్, రాఘవయ్య, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
