Wednesday, August 19, 2026
HomeTelanganaజిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా

జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా

📰 Generate e-Paper Clip

ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.

టార్గెట్ల పేరుతో అధికారుల వేధింపులు ఆపాలి.

సమస్యలు పరిష్కరించకపోతే-జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు సిఐటియు పిలుపు.

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్  కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆశావర్కర్స్ యూనియన్(CITU) ఆధ్వర్యంలో సోమవారం రోజున హజిపూర్ మండలం గుడిపేటలోని జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం జిల్లా వైద్య శాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటి జిల్లా కార్యదర్శి, సమ్మక్క ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. గతంలో పలు సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైద్య శాఖ అధికారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, అధికారి కూడా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్న సమస్యలు పరిష్కారం కాలేదని ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ పీఆర్సీని వెంటనే చెల్లించాలి. అదే విదంగా 2021 నుండి నేటి వరకు 2సంవత్సరాలు గడుస్తున్న MDA మరియు లెప్రాసి డబ్బులు చెల్లించాలి. అర్హులైన ఆశాలను 2 ఎన్ఎమ్ లుగా ప్రమోట్ చేయాలి. టార్గెట్ల పేరుతో వేధింపులు ఆపాలి. టీబీ డబ్బులు చెల్లించాలి. ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి. కూటమి డబ్బాలు ఆశాలతో మోపించద్దు. పల్స్ పోలియో డబ్బులు పూర్తిగా చెల్లించాలి. టీఏ, డిఏ లు చెల్లించాలి. 20లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి. పైన పేర్కొన్న సమస్యలు పరిష్కరించాకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని డిమాండ్. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కోశాధికారి సరోజ, ఉపాధ్యక్షురాలు అరుంధతి, లీలా, రాణి, కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.