Tuesday, August 18, 2026
HomeTelanganaజూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడిన నగదు

జూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడిన నగదు

📰 Generate e-Paper Clip

మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ.89. 91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంజనేయులు న్యూస్, జూబ్లీహిల్స్: మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ. 89.91లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో దాడులు నిర్వహించగా.. ఓ కారులో తరలిస్తున్న నగదు పట్టుబడింది. కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్ గా గుర్తించారు. ఆయన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ కు డ్రైవర్ గా తేల్చారు. నగదును జూబ్లీహిల్స్ లొనీ త్రిపుర కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.