
కార్యాలయంలో నిద్రపోతున్న సూపరింటెండెంట్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. సమస్యల గోడును విన్నవించుకునేందుకు వచ్చే ప్రజలకు పరిష్కారం లభించని పరిస్థితులు ఏర్పడు తున్నాయి. విధి నిర్వహణలో మేల్కొని ఉండాల్సిన అధికారి పని వేళలో తన కుర్చీలో కునుకు తీయడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాల యంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎ.పూర్ణచందర్ రావు బుధవారం విధి నిర్వహణలో ఇలా నిద్రపోయారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులు గాఢ నిద్రలో ఉన్న పూర్ణ చందరు ఫొటో తీసి ఇలా మీడియాకు సమాచారం అందించారు. గతంలో ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కొండయ్య కూడా ఇలాగే విధిల్లోనే నిద్రపోయారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక మండల అధికారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
