Monday, August 17, 2026
HomeTelanganaరైతులందరికీ నష్ట పరిహారం అందించాలి: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

రైతులందరికీ నష్ట పరిహారం అందించాలి: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మందమర్రిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వృద్ధాప్య పెన్షన్ అందించాలి అలాగే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం. ఉపసర్మమించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. దాని స్థానంలో కొత్త పథకాన్ని అందిస్తామని, దాన్ని ఊసే లేకుండా పోయింది అని, ఆ పథకం లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పకృతి పైపరీత్యం వలన రైతుల వేసిన పంట ద్వారా భారీ నష్టాలు రావడం వలన, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.. సుమారు 10 లక్షల ఎకరాల పంట కు నష్టం వచ్చింది. పంటల బీమ లేక పరిహారం అందగా రైతులకు తీవ్ర నష్ట పోయారు. మొదట్లో నే నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి అందించడంలో తెలంగాణ రాష్ట్రం విఫలం అయింది. వెంటనే నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్ నెల అయిపోయిన సరే అయిపోయి రెండో నెల వస్తుంది. ఇంతవరకు వాళ్ళ డబ్బులు అకౌంట్లో పడలేదు. వెంటనే వృద్ధాప్య పెన్షన్ వృద్ధులకు అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.. రాష్ట్ర మొత్తం సమస్యలు ఉండంగా దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారు..

వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో  ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో అవి వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒరం కవి రాజ్, పట్టణ అధ్యక్షుడు.బండారి శివ కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.