Tuesday, August 18, 2026
HomeTelanganaఉచిత ప్రమాద బీమా పరిహారం చెల్లింపు

ఉచిత ప్రమాద బీమా పరిహారం చెల్లింపు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: యూనియన్  బ్యాంకులో శాలరీ ఎకౌంట్ కలిగి ఉన్నందున గత సంవత్సరం ఎస్ఆర్ పి-3 బొగ్గుగని ప్రమాదంలో మరణించిన బేర లక్ష్మయ్య కుటుంబసభ్యులకు 30 లక్షల ఉచిత ప్రమాద బీమా పరిహారం మొత్తాన్ని ఎస్ఆర్ పి- 3 బొగ్గుగని ఆవరణలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ. ప్రస్తుతం అన్ని బ్యాంకుల కంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారు సింగరేణి ఉద్యోగులకు 82 లక్షల ప్రమాద భీమా కల్పించడం చాలా గొప్పవిషయం అన్నీ ఉద్యోగులందరూ ఈ ప్రయోజనాన్ని పొందాలని తెలియజేశారు. అనంతరం యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజరు అరున్ కుమార్ మాట్లాడుతూ. సింగరేణి ఉద్యోగులందరూ తమ (శాలరీ) అకౌంట్ ను యూనియన్ బ్యాంకులోకి మార్చుకోవాలని, రూపే సెలెక్ట్ ఎటిఎం కార్డు తీసుకోవాలని మరియు శాలరీ అకౌంట్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే ఇన్సూరెన్స్ పాక్షిక అంగవైకల్యానికి గానీ, పూర్తి అంగవైకల్యానికి కూడా వర్తింస్తుందని 18 నుండి 70 సంవత్సరాల వయస్సువారికి వర్తిస్తుందని తెలియజేశారు. ఇతర అన్ని బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే (పర్సనల్) వ్యక్తిగత ఋణాలు  మరియు ఇతర రిటేల్ ఋణాలు ఇస్తున్నామని వేరే ఇతర బ్యాంకుల నుండి యూనియన్ బ్యాంకులోకి ఋణాలను మార్చుకోవాలిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా డివైజిఎం గోవిందరాజులు, ఎస్ఆర్ పి -3 గని మేనేజర్ సంతోషీ, టిబిజికెఎస్ ఉపాద్యక్షులు సురేందర్ రెడ్డి, ఎఐటియుసి నాయకులు మురళి  చౌదరి, యూనియన్ బ్యాంకు ఎజిఎం వంశీకృష్ణ, లీడ్ బ్యాంక్ అధికారి మహిపాల్ రెడ్డి, మంచిర్యాల జిల్లా యూనియన్ బ్యాంకు మేనేవర్లు.. ఎస్ఆర్ పి-3 గని సింగరేణి ఉద్యోగస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.