
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని కళాకారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని “శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, ఉత్తమ కూచిపూడి అవార్డు గ్రహీత, నాట్య విభూషణీ, అన్నం కల్పన” ను జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ట్రైని కలేక్టర్ గౌతమి, ఎమెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఘనంగా శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, చైర్మన్ పెంట రాజయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

