Wednesday, August 19, 2026
HomeTelanganaకాళోజీ నారాయణరావు ఆచరించిన జీవితం స్ఫూర్తిదాయకం.

కాళోజీ నారాయణరావు ఆచరించిన జీవితం స్ఫూర్తిదాయకం.

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా; ప్రజా కవి కాళోజీ నారాయణరావు చేసిన రచనలు, ఆచరించిన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ భారతి హెూళీ కేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాళోజి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజం నిరంకుశ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలపై తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారని తెలిపారు. కత్తి కన్నా కలం గొప్పదని, ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుందని తన రచనల ద్వారా నిరూపించారని అన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించి, యువతలో స్ఫూర్తి నింపారని అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కాళోజి చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.