Wednesday, August 19, 2026
HomeTelanganaఅక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి లో బుధవారం ఉదయం సుమారుగా 7:15 నిమిషాలకు పోచమ్మ చెరువు వద్ద వాకింగ్ చేసి అనంతరం ఇంటికి వెళ్తుండగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఆపి ఉన్న ఒక బొలెరో వాహనం నుండి అవు పెండ మూత్రం బయటకు కారుతుండడం గమనించి బండి నెంబర్. TS 21 T 2272  వాహనంలో ఆవులు ఉన్నాయని అనుమానం వచ్చి బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ కు ఫోన్ చేసి వారు రాగానే ఇద్దరం కలిసి ఆ వాహనంలో చూడగా ఏడు ఆవులు రెండు లేగ దూడలు హృదయ విదారకంగా తాళ్లతో కట్టేసి ఒకదానిపై ఒకటి పడేసి ఉన్నాయి వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ వెంటనే స్పందించి ఆ బండిని పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం ఆవులను గురజాల వద్ద గల గోశాల కు తరలించడం జరిగింది..

ఆ బండి డ్రైవర్ SK సాదిక్ ను ఎవరి దగ్గర కొని ఎవరు తీసుకు వెళుతున్నారు అని అడగగా మాట్లాడుతుండగానే వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఈ ఆవులను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడగగా బెజ్జూర్ మండలం కుకుడా నుండి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని దొలవకుంట గ్రామానికి తీసుకొని వెళ్తున్నామని అన్నారు. ఆవులను తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఒకటవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.