Wednesday, August 19, 2026
HomeTelanganaఆదర్శ విద్యాలయం లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఆదర్శ విద్యాలయం లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

దేశానికి దిక్చూచి ఉపాధ్యాయుడు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రం: దేశానికి దిక్చూచి లాంటివాడు,విద్యార్థులకు మార్గదర్శకుడు ఉపాధ్యాయుడేనని ఆదర్శ విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్/ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి అన్నారు.సోమవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు , ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ,,సమాజంలో ఉపాధ్యాయునికి అపారమైన గౌరవం ఉందని,సమాజంలో ఉపాద్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు.స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ అపార మేధావి అని ఆయన ఉపాద్యాయుని నుండి రాష్టప్రతి స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయుడని, ఇలాంటి వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అంతే కాదు నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిది అన్నారు.చాలమంది ఉపాధ్యాయులు ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. అందకే ఉపాధ్యాయువృతికి మించిన పని మరోకటిలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులు వెంకటేష్,భాగ్యారాజు, కృష్ణ, శ్రీశైలం, శ్రీరాములు, నర్మదా, స్వాతి, స్పందన, శాలిని, మణెమ్మ,అన్నా పూర్ణ, విద్యార్థులు పాఠశాల సిబ్బంది  తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.