
వీఆర్ఏ, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు సీఐటీయు జిల్లా కమిటీ మద్దతు…
మంచిర్యాల జిల్లా: సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయు) మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బి.మధు సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి హాజరై మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల కనీస వేతనాల జివోలను అమలు చేయలేదు. దింతో కార్మికుల జీవన విధానం ప్రశ్నర్తకంగా మారుతుంది. జిల్లాలో ఇతర ప్రైవేట్ హాస్పిటల్, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్లు, డి -మార్ట్, విశాల్ మార్ట్, సూపర్ మార్కెట్లో, అన్ని రకాల ఇండస్రిస్ లల్లో నిరంతరం పనులు చేస్తున్న కార్మికులకు సంబందిత యాజమాన్యం కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఒక వైపు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్న వాటిని ప్రభుత్వం అరికట్టడంలో నిర్లక్ష్యంగా ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు మరియు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంపు కోసం జరిగే సమ్మెకు సీఐటీయు జిల్లా కమిటీ పూర్తి మద్దతూ తెలియచేస్తుంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కనీస వేతనాల జివోను విడుదల చెయాలి. ప్రైవేట్ రంగాలల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షకార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, సంకె రవి, దూలం శ్రీనివాస్, గుళ్ల బాలాజీ, రామస్వామి, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.
