Monday, August 17, 2026
HomeTelanganaమొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

📰 Generate e-Paper Clip

మంచిర్యాల  జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

మంచిర్యాల జిల్లా: భావి తరాలకు సహజ వాయువుతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంలో భాగంగా మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. స్వతంత్ర భారత వజోత్సవ మహోత్సవంలో ఆదివారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీ పరిధిలోని పౌనూరు కూడలి వద్ద పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సం॥లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర భారత వత్రోత్సవ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన వనమహోత్సవంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటారని, మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, తహశీల్దార్ మోహన్రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి నత్యనారాయణ, అటవీ డివిజనల్ అధికారి వినయకుమార్ సాహు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ, అటవీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.