
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో కంప్యూటర్ మానిటర్ చోరి జరిగిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రేంజ్ అధికారి గౌరీ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం కాల్టెక్స్ అటవీ రేంజ్ కార్యాలయానికి ఈనెల 14న విధులకు వెళ్లిన అధికారులకు తాళం పగులకొట్టి ఉన్నట్లు గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా రెండు కంప్యూటర్లలో ఒక మానిటర్ చోరికి గురైందని నిర్ధారించారు. దాని విలువ రూ. 4వేలు ఉంటుందని, దొంగతనం విషయమై టూ టౌన్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు.
