Monday, August 17, 2026
HomeTelanganaవరిధాన్యం సంబంధిత సి.ఎం.ఆర్. త్వరగా అందించాలి.?

వరిధాన్యం సంబంధిత సి.ఎం.ఆర్. త్వరగా అందించాలి.?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి.

మంచిర్యాల జిల్లా: వరిధాన్యం సంబంధిత రబీ పంట 2020-21, 2021-22 సి.ఎం.ఆర్.లు ప్రభుత్వానికి త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ బాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయకోతో కలిసి భారతీయ ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) అధికారులు, రైస్ మీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు రవి పంట 2020-21, వానాకాలం 2021-22 లలో 3 వేల 712 మెట్రిక్ టన్నుల వరిధాన్యంకు సంబంధించి సి.ఎం.ఆర్. లను త్వరగా అందించాలని తెలిపారు. ఖరీఫ్ 2021-22 సంబంధించి ఎఫ్.సి.ఐ.కు అందించవలసిన 50 వేల 257 మెట్రిక్ టన్నుల సి.ఎం.ఆర్.ను ఆగస్టు 31వ తేదీ నాటికి ఖచ్చితంగా అందించాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, భారతీయ ఆహార సంస్థ అధికారులు, రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు సల్మాను అంతయ్య, రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.