
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకపోతే మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు. గురువారం కలెక్టర్ బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని నెన్నెల్ మండలంలో గల గన్ పూర్, గొల్లపల్లి గ్రామాలను సందర్శించిన నేపథ్యంలో గన్ పూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ భారతి హోళీ కేరి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అనంతరం గ్రామాలలో పర్యటించారు. చెత్త వేరు చేయు స్థలము నర్సరీ పల్లె ప్రకృతి వనం సందర్శించారు. గొల్లపల్లి గ్రామంలో చెత్త వేరు చేయు స్థలాన్ని సందర్శించి చెత్త వేరు చేయడం అన్నది క్రమం తప్పకుండా జరగాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆదేశించారు. విధుల పట్ల అధికారులు ఎవరూ అలసత్వం వహించరాదని తెలియజేశారు.
