Monday, August 17, 2026
HomeTelanganaపోటీ పరీక్షలకు అభ్యర్థులు ఏకాగ్రతతో సిద్దం కావాలి

పోటీ పరీక్షలకు అభ్యర్థులు ఏకాగ్రతతో సిద్దం కావాలి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల  కలెక్టర్ భారతి హోళికేరి

మంచిర్యాల జిల్లా: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఏకాగ్రతతో చదవి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఆంగ్ల, తెలుగు మాధ్యమాలలో ప్రతి ఒక్కరికి 11 పోటీ పరీక్షల పుస్తకాల సెట్ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 13వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎం. రామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణలో శిక్షణ పొందుతున్న 820 మంది అభ్యర్థులకు పుస్తకాల సెట్లను అందించడం జరుగుతుందని, ఈ పుస్తకాల సెట్లను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలకు సిద్దం కావడంతో పాటు విజయవంతం సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో 13వ బెటాలియన్ కమాండెంట్ ఎం. రామకృష్ణ, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.