Monday, August 17, 2026
HomeTelanganaక్వారీ జాతర ను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ నారాయణ

క్వారీ జాతర ను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ నారాయణ

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిర్యాల ఏసీసీ క్వారీలో ఆదివారం రోజున జరగనున్న దుర్గాదేవి జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సీ.ఐ. నారాయణ నాయక్ ప్రజలను కోరారు. ఆదివారం నాటి  జాతర జరిగే ప్రాంతానికి వెళ్లే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆయన చెప్పారు. జాతరకు మంచిర్యాల పరిసరా ప్రాంతాలతో సింగరేణి కోల్‌బెల్టు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అదేవిధంగా కొమురంభీం జిల్లా, గోదావరిఖని, బెల్లంపల్లి ప్రాంతాలే కాకుండా మహారాష్ట్ర ప్రాంతం నుండి విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. గత కొద్దీ రోజులు గా వర్షాలు పడడం వలన రహదారులు చెడిపోవడం జరిగింది కావున హెవీ వెహికల్ లతో వస్తే వాహనాలు ఇరుక్కొని పోవడం, లేదా ఏదైనా సమస్య వచ్చి ఆగిపోయినట్లయితే ట్రాఫిక్ సమస్య అవుతుంది.  వచ్చే భక్తులు ఇబ్బంది పడవలసి వస్తుంది.కావున హెవీ వెహికల్ కి అనుమతి లేదు అని స్పెషల్ డ్రంక్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది అని అదేవిధంగా గుడి చుట్టూ ప్రక్కల ప్రాంతంలో కూడా బూరుదతో ఉన్నందుకు భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళగలరు అని సూచించారు.

జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది మఫ్టీలో  నిఘాలో వుంటారని అని తెలిపారు. భక్తులు ఓపికతో దుర్గాదేవి అమ్మ వారిని దర్శించుకుని ఇంటికి వెళ్లాలని సూచించారు. జాతరకి వచ్చే భక్తులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. రామగుండం సీపీ గారి ఆదేశాలు మేరకు మంచిర్యాల డీసీపీ, ఏసీపీ, పర్యవేక్షణ లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీఐ నారాయణ ఒక ప్రకటన లో తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.