Monday, August 17, 2026
HomeTelanganaప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..?

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..?

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ తో కలిసి మల్కాపూర్, రామగుండం A కాలనీ, పెద్దంపేట ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రాంతంలో సందర్శించి పరిస్థితిలను పరిశీలిస్తూ భారీ వర్షాల కారణంగా  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేయాలని,  ప్రజలను అప్రమత్తం చేయాలని, అధిక వర్షాలు దృష్ట్యా రక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినారు.  పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని ఆదేశించారు. నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద నీరు వచ్చే లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలను గుర్తించి అవసరమైన మేర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఇంచార్జి డీసీపీ గారి వెంట గోదావరిఖని ఏసీసీ గిరి ప్రసాద్, రామగుండం సీఐ కణతల లక్ష్మి నారాయణ, ఎస్ఐ సంతోష్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.