
మంచిర్యాల జిల్లా: బొగ్గు పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ కార్మికులతో సమానంగా ఒకటో క్యాటగిరితో 11వ వేతన ఒప్పందం చేయాలని కోరుతూ శుక్రవారం సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో వేజ్ బోర్డు సమావేశం సందర్భంగా వారు కోలిండియా జిఎం అజయ్ కుమార్ చౌదరికి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డి. బ్రహ్మానందం, ఎ. వెంకన్న పాల్గొన్నారు..
