
మంచిర్యాల జిల్లా: సారూ కరెంటోస్తలేదు వారం రోజులై మోటార్లు నడ్తలేవు రైతులు వేడుకున్నా పట్టించుకోని ట్రాన్స్ కో అధికారులు నాకు తెల్వకుంట నువ్వు పనులు జేస్తున్నవ్. రైతుల వద్ద పైసలు తీసుకుంటున్న అనే అక్కసుతో రైతు ఇంట్లోనే కొట్టుకున్నారు. వేమనపల్లి మండలం దస్నాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం శుక్రవారం జేఎల్ఎం ఉదయ్, రోజు వారీ కూలీ రాజ్ కుమార్ వెళ్లారు. మధ్యాహ్నం ఆ ఊరి పరిధిలో ట్రాన్స్ఫర్మర్ కు కరెంట్ సరఫరా ఇచ్చేందుకు రైతులు అడగడంతో అక్కడే. ఆగారు. మధ్యాహ్నం కావడంతో రైతు వేపూరి నారాగౌడ్ ఇంట్లో భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బదిలీపై వెళ్తున్న లైన్ ఇన్స్పెక్టర్ పుండరీక్ వీళ్లకు తోడయ్యాడు. అందరూ కలిసి నారాగౌడ్ ఇంట్లో భోజనం చేస్తుండగా లైన్ మెన్ శైలేష్ రహస్యంగా వెళ్లి తన మొబైల్ తో వీడియో తీయడంతో గొడవ మొదలైంది. దొంగచాటున వీడియో తీసుడేందని జేఎల్ఎం, లైన్ ఇన్స్పెక్టర్ మొబైల్ లాక్కున్నాడు. ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు. బూతులు తిట్టుకుంటూ పెనుగులాడారు. ఈ దాడిలో జేఎల్ఎం ఉదయ్ తలకు తీవ్రగాయమైంది. లైన్ ఇన్స్పెక్టర్ పుండరీక్ భుజానికి, చిటికెన వేలికు గాయాలయ్యాయి. రాత్రి వైద్యం నిమిత్తంజేఎల్ఎం చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి, లైన్ మెన్ శైలేష్ స్థానిక పీహెచ్సీలో చికిత్స చేయించుకున్నారు. జేఎల్ఎం నీల్వాయి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
నీల్వాయి ఎస్సై గోపతి నరేష్ ను వివరణ కోరగా నేరుగా ఫిర్యాదు అందలేదని, ఫోన్ ద్వారా సమాచారం తెలిపారన్నారు. ట్రాన్స్ కో అధికారులు ఈగొడవను సీరియస్ గా తీసుకుని గొడవ సద్దుమణిగే ప్రయత్నాలు చేస్తున్నారు.
