Monday, August 17, 2026
HomeTelanganaప్రారంభమైన ఆషాఢ బోనాలు.. ముస్తాబువుతోన్న గోల్కొండ కోట

ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. ముస్తాబువుతోన్న గోల్కొండ కోట

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ ముస్తాబవుతోంది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా కాస్త సందడి తగ్గినా ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ద ర్వాజ, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు నిర్వహించనున్నారు. గోల్కొండ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తలసాని అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తలసాని మాట్లాడుతూ.. బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోంన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీక లాంటిదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్థిక సాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా 8 ఏళ్లుగా రాష్ట్రంలో బోనాలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నామని.. నిర్వహణ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.