Monday, August 17, 2026
HomeTelanganaక్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు: ఎస్పీ

క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు: ఎస్పీ

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లా: అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయం నుండి శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామా శివారులోని ఓ కొట్టంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిన కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఈనెల 19 వ తేదిన జరిగిన ఈ దాడుల్లో తొమ్మిది మంది నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సదరు నిందితులను విచారించగా షఫీ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నాడని తేలింది. ఈ పేకాట స్థావరాలను కనిపెట్టడంలో విఫలమైనందున ఇంద్రవెల్లి ఎస్ఐ నాగ్ నాథ్ తో పాటు పేకాట ఆడిన హెడ్ కానిస్టేబుల్ దేవి లాల్ ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనన్న ఎస్పీ అసాంఘిక చర్యలు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.