Friday, August 21, 2026
HomeTelanganaతెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల బాదుడు..

తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల బాదుడు..

📰 Generate e-Paper Clip

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం పడింది. కిలోమీటర్ల వారీగా డీజిల్‌ సెస్‌ విధించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
అన్ని రకాల బస్సుల్లో దూరాన్ని బట్టి రేపటి నుంచి డీజిల్ సెస్‌ వసూలు చేయనుంది. తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా స్లాబ్‌లు తీసుకొచ్చిన ఆర్టీసీ.. ఛార్జీల పెంపు నుంచి జీహెచ్‌ఎంసీని మినహాయించింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ బస్సుల్లో డీజిల్‌ సెస్‌ కనీసం రూ.5గా నిర్ణయించింది.

250 కిలోమీటర్ల దూరం వరకు పల్లె వెలుగులో రూ.45, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల వరకు రూ.90, డీలక్స్‌ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.125 డీజిల్‌ సెస్‌ వసూలు చేయనున్నారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కనీస దూరానికి రూ.10లు, 500 కిలోమీటర్ల వరకు రూ.130 డీజిల్‌ సెస్‌ రూపంలో వసూలు చేయనున్నారు. ఏసీ సర్వీసుల్లో కనీస దూరానికి రూ.10, 500 కిలోమీటర్ల వరకు రూ.170 డీజిల్‌ సెస్‌ రూపంలో వసూలు చేయనున్నారు. కనిష్ఠ, గరిష్ఠ దూరాన్ని బట్టి టికెట్లపై ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ వసూలు చేయనుంది.

గతంలో రౌండప్‌, టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్‌ సెస్‌ కింద రెండు రూపాయలు, ఎక్స్‌ ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.