Friday, August 21, 2026
HomeTelanganaమాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై నిందారోపణలు చేయడం తగదు

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై నిందారోపణలు చేయడం తగదు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: స్మశాన వాటిక స్థలం కొనుగోలుపై ఎమ్మెల్యే తనయుడు విజిత్ రావు ఏ హోదాలో వివరణ ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక నిర్మాణం కొనుగోలు చేసిన స్థలానికి ఎమ్మెల్యే ఎందుకు ఎక్కువ ధరకు కొన్నారో ప్రజలకు వివరించాలన్నారు. రూ. 35 లక్షలకు ఎకరం స్థలంను ఇటీవలే ఓ వ్యక్తి కొనుగోలు చేశాడని, అలాంటప్పుడు ప్రజల విరాళాలతో రూ. కోటితో ఎందుకు కొనాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అకారణంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై విమర్శలు చేయడం రివాజుగా మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రేమ్ సాగర్ రావుపై నిందారోపణలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ వడ్డే రాజమౌళి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు, కౌన్సిలర్ సల్ల మహేష్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కౌన్సిలర్లు పూదరి సునీత, జోగుల శ్రీలత, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.