Tuesday, August 18, 2026
HomeTelangana'6 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే తెగిన అవయవాలను అతికించొచ్చు'..?

‘6 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే తెగిన అవయవాలను అతికించొచ్చు’..?

📰 Generate e-Paper Clip

మణికట్టు అతికించిన రోగితో వైద్య బృందం

సంగారెడ్డి జిల్లా: వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చేలా ప్రయత్నిస్తే ప్రమాదాల్లో తెగి పడిన అవయవాలు అతికించడానికి ఆస్కారం ఉంటుందని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యంత్రంలో పడి తెగిపోయిన కార్మికుడి మణికట్టుని తిరిగి అతికించిన ఆసుపత్రి ఆర్థోపెడిక్ టీమ్ వైద్యులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సంగారెడ్డి జిల్లా నందిగ్రామ్ ప్రాంతం పానియాల పరిశ్రమలో పని చేస్తున్న హరీష్ (22) చేయి యంత్రంలో పడి మణికట్టు వరకు తెగిపడింది. <span;>ఈ క్రమంలో మణికట్టుని ఓ ప్లాస్టిక్ కవర్లో వేసి దాన్ని ఐస్ లో పెట్టి తీసుకొచ్చారు. అనేక గంటలు శ్రమించిన వైద్యులు మణికట్టుని తిరిగి అతికించారు. కొన్ని నెలల్లో తిరిగి చేయి మామూలు స్థితికి వస్తుంది. చేతులు, వేళ్లు, కాళ్లు తెగిపడ్డప్పుడు వెంటనే అవయవాన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఐస్ లో పెట్టుకొని తీసుకురావాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు తాగునీళ్లు ఇవ్వడం వంటి చర్యలు చేయవద్దు. ముందు అంబులెన్సు వచ్చే విధంగా చేయాలి..

‘6 గంటల వ్యవధి లోపు రోగిని అవయవాలను చేర్చితే వాటిని రక్షించడానికి అవకాశాలు ఉంటాయి” అని వివరించారు. కార్యక్రమంలో వైద్యులు అశోక్ రాజు, వాసుదేవ జువ్వాడి, కిలారు ప్రఫుల్, ప్లాస్టిక్ సర్జన్లు వెంకటేష్ బాబు, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.