Wednesday, August 19, 2026
HomeTelanganaమంచిర్యాల మున్సిపాలిటీలో వైకుంఠ రథం ప్రారంభం.!

మంచిర్యాల మున్సిపాలిటీలో వైకుంఠ రథం ప్రారంభం.!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథంను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ నిధులు రూ. 18 లక్షల వ్యయంతో వైకుంఠ రథం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో పేదలు మృతి చెందితే మృతదేహాలను శ్మశానవాటికలకు ఉచితంగా తరలించేందుకు వాహనం దోహదపడుతుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.