Tuesday, August 18, 2026
HomeTelanganaఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వ్యక్తి హల్ చల్.?

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వ్యక్తి హల్ చల్.?

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లా: అదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించి హల్చల్ చేసాడు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీ కి చెందిన ఆవుల సంతోష్ అనే వ్యక్తి 170 సర్వేనెంబర్ లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తన వికలాంగులైన తల్లికి ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడు. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తన ఇల్లుని, స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో మానసిక ఒత్తిడికి లోనై ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు కార్యాలయంలో సోమవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే క్యాంపు కార్యాలయంలో ఉన్న పలువురు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు సదరు వ్యక్తిని అడ్డుకొని పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం సంతోష్ ఒంటిపై నీళ్లు చల్లారు.

కాగా తన ఇంటిని, స్థలాన్ని టిఆర్ఎస్ పార్టీకి చెందిన దయాకర్, నవీన్, కార్తీ తో పాటు మరికొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వికలాంగులైన తల్లికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలంలో డ్రైవర్ గా పని చేస్తున్నా తాను కొంత డబ్బును పోగు చేసుకుని ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే కొందరు టిఆర్ఎస్ నాయకులు గత కొన్ని రోజులుగా తన స్థలం తో పాటు ఇంటిని కబ్జా చేసుకునేందుకు చేస్తున్నారని, తాజాగా నిన్న తన భార్యా పిల్లలను సైతం ఇంటి నుండి గెంటేశారని ఆరోపించారు. తనకు సత్వర న్యాయం జరగాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చానని,

తనకు ఎమ్మెల్యే పై మున్సిపల్ చైర్మన్ పై ఎలాంటి ఆరోపణ లేదని పేర్కొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.