Tuesday, August 18, 2026
HomeAndhraఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

📰 Generate e-Paper Clip

ఆంధ్ర ప్రదేశ్: గ్రామీణ రహదారుల రిపేర్ కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, గ్రామీణ రహదారులు, తాగునీటిపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ చెరువుకు కెనాల్స్, ఫీల్డర్ ఛానెల్స్కి లింక్ చేయగలిగితే నీటి ఎద్దడిని నివారించవచ్చని అన్నారు.

కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాల్వల ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలన్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నెల రెండో వారానికి గ్రామీణ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. 9 వేల కి.మీ రహదారుల మరమత్తు కోసం ప్రభుత్వం రూ.1073 కోట్ల ఖర్చు చేయనుంది. గ్రామాల్లో ఇక తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఈ సమావేశంలో సీఎం నిర్ణయించారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిపేందుకు సీఎం ఆదేశించారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. రూ.1900 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.