Monday, August 17, 2026
HomeTelanganaశోభాయాత్రలకు డిజేల అనుమతి లేదు: డిసీపీ

శోభాయాత్రలకు డిజేల అనుమతి లేదు: డిసీపీ

📰 Generate e-Paper Clip

                 మంచిర్యాల ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్

ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు..

రామగుండం పోలీస్ కమిషనరేట్: మంచిర్యాల జోన్ పరిధిలో శోభ యాత్రలకు ఏలాంటి డీజేల అనుమతి లేదని ఎవరైనా నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారు ఒక ప్రకటన లో తెలిపారు. కొంతమంది ర్యాలీ లు నిర్వహిస్తూ డిజే లను వాడుతున్నారు. ఎవరైనా డిజే లు ఉపయోగిస్తే వీడియోగ్రఫీ తో రికార్డు చేసి యాత్రకు సంబంధించిన వ్యక్తుల పై మరియు డిజేల యజమానులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని అన్నారు.శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ పోలీస్ వారికీ సహకరించి శాంతియుత, ప్రశాంతమైన వాతావరణంలో పండగలు జరుపుకోవాలని కోరారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.