Monday, August 17, 2026
HomeTelanganaరామ్ లేనిదే భీమ్ లేడు: ఎన్టీఆర్

రామ్ లేనిదే భీమ్ లేడు: ఎన్టీఆర్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్: రామ్ చరణ్  లేనిదే ‘ఆర్ఆర్ఆర్ సినిమా లేదని, అల్లూరి సీతారామరాజు పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారని ఎన్టీఆర్ అన్నారు. ఈ ఇద్దరు కలిసిన నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్రలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బందానికి, సినిమాను ఆదరించిన వారందరికీ ఓ లేఖ ద్వారా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. “ఆర్ఆర్ఆర్పై మీరు చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ చిత్రం నా కెరీర్ లాండ్మార్క్ గా నిలిచింది. పాత్రలో ఒదిగిపోయేలా స్ఫూర్తినిచ్చిన జక్కన్నకు (దర్శకుడు రాజమౌళి) థ్యాంక్స్. జక్కన్నా.. నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చి, పాత్రకు తగ్గట్టు నన్ను నీరులా మార్చావు. చరణ్.. నువ్వులేనిదే ‘ఆర్ఆర్ఆర్’ను ఊహించుకోలేను. నువ్వులేనిదే ఈ సినిమానే లేదు.. నా పాత్ర కొమురం భీమ్ కూడా అంత అద్భుతంగా వచ్చేది కాదేమో! అల్లూరి సీతారామరాజు పాత్రకు నవ్వు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు” అని ఎన్టీఆర్ అన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.