Friday, August 21, 2026
HomeTelanganaకలకలం రేపిన ఫేక్ డాక్టర్ ఉదంతం..?

కలకలం రేపిన ఫేక్ డాక్టర్ ఉదంతం..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో ఫేక్ డాక్టర్ ఉదంతం కలకలం రేపింది. ఉక్రెయిన్ లో ఎండీ చేసిన ఒక వైద్యుడు ఇండియన్ కౌన్సిల్ అర్హత పరీక్ష రాయకుండానే కార్డియాలజిస్ట్ గా కొనసాగుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో మంగళవారం శ్రీనిధి ఆస్పత్రిపై జిల్లా వైద్యాశాఖాధికారి కొమురం బాలు దాడులు జరిపారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ గా కొనసాగుతున్న డాక్టర్ కృష్ణమూర్తి తప్పుడు పత్రాలతో వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డాక్టర్ కృష్ణమూర్తి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తప్పుడు ధృవపత్రాలతో వైద్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి కొమురం బాలు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.