Wednesday, August 19, 2026
HomePoliticalబండారం బయట పడుతుందనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు: ఈటల రాజేందర్

బండారం బయట పడుతుందనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు: ఈటల రాజేందర్

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అంకెల గారడీ.

ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదు.

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచిది కాదని చెప్పాం. 20 ఏళ్ల అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా స్పీకర్ కు పదే పదే గుర్తు చేశాను. మా సీట్లో ఉండి నిరసన తెలిపితే సస్పెండ్ చేశారు. ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదు” అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని చేసిన ఆరోపణలపై ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు కట్టే పన్నుల మీద ప్రభుత్వాలు నడుస్తాయి తప్పితే.. కేంద్ర ప్రభుత్వం నిధులతో కాదనే విషయాన్ని హరీశ్ రావు గుర్తించుకోవాలన్నారు. “బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు 20 రోజులకు పైగా జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం 7 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం. కిరాయి భవనాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి తప్పితే సొంత భవనాలు లేవు. పాఠశాలలు బంజరు <span;>దొడ్డిలా ఉంటే నాణ్యమైన విద్య అందుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అంకెల గారడీ. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.37 వేల కోట్లు. గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టించి యువకులను మద్యానికి బానిస చేస్తున్నారు. యువశక్తి గంజాయి, లిక్కర్ కు బానిస అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చకు సిద్ధం. బడ్జెట్ పై నేను మాట్లాడితే బండారం బయట పడుతుందనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. నాకు చట్టం మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. సస్పెన్షన్ పై న్యాయ పోరాటం చేస్తాం” అని ఈటల పేర్కొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.