ఆదిలాబాద్ జిల్లా: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బోథ్ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల అక్రమాలపై రసాభాస నెలకొంది. అధికారుల తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధికారులను నిలదీసాడు. అధికారులు తన మాట వినట్లేదని ఎమ్మెల్యే సమావేశం నుండి వాకౌట్ అయ్యారు. అటు ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడిన ఎంపీడీవో చౌహన్ రాధాను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ సిక్త పట్నాయక్ ప్రకటించారు. దీంతో ఎంపీడీవో రాధా సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ నిరసన తెలిపి సమావేశాన్ని ఎంపీపీ వాకౌట్ చేసారు. కాగా ప్రొసీజర్ ప్రకారమే ఎంపిడిఓ ని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వివరణ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారందరినీ సస్పెండ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు..