Telugu Updates
Logo
Natyam ad

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్…

తెలంగాణ: సీఎం కేసీఆర్‌ శుక్రవారం యాదాద్రికి వస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణోత్సవంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపనున్నట్టు సమాచారం. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతోపాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా యాదాద్రి గర్భాలయంలో బంగారు తాపడం పనులు, కలశస్థాపన తదితర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం..