Telugu Updates
Logo
Natyam ad

పెళ్లికి వెళ్లిన వీడియోను చూపిస్తూ రాజకీయమా..?: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్లోని ఓ నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారిన విషయం. తెలిసిందే. ఆయనతో పాటు నేపాల్లోని చైనా రాయబారి కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో విపక్షాలు తీవ్రంగా విరుచుపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.. రాహుల్ గాంధీ ఓ పెళ్లికి వెళ్లిన వీడియోను చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లికి వెళ్లిన వీడియోను చూపిస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు..

అర్ధరాత్రి పార్టీలు చేసుకొనే అధికార పార్టీ నేతలు తనకు తెలుసునని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. ధరణిలో ఉన్న లోపాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుందని జగ్గారెడ్డి మండిపడ్డారు.