Telugu Updates
Logo
Natyam ad

ఇండ్లలోకి ప్రవేశించిన వరద నీరు..?

మంచిర్యాల జిల్లా: భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్, ఎన్టీఆర్ కాలనీలు జలమయ్యాయి. సమీపంలోని రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాలనీల్లోకి చేరింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వరద నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. గత ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వరద ముప్పు పొంచి ఉన్న కాలనీల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు..